బాజిరెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలుపుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సేవకోసం ఏర్పాటైన ఆర్టీసీని లాభాపేక్షతో చూడటం సరికాదని, నష్టాల పేరు చెప్పి సంస్థను ప్రైవేటీకరించే దిశగా ఆలోచించడం సరికాదని వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బాజిరెడ్డి గోవర్ధన్‌ను గురువారం ఆయా సంఘాల నేతలు కలసి అభినందించారు. ఈ సందర్భంగా సంస్థను గట్టెక్కించే దిశలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కోరారు.
మూడునాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రానిపక్షంలో ప్రైవేటుపరం చేస్తామని ముఖ్యమంత్రి అన్నట్టుగా చైర్మన్ పేర్కొనటాన్ని వారు ప్రస్తావించారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఎన్నో ఇబ్బందులకు గురైందని, దాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పన్నులు లేకుండా చూస్తే పరిస్థితి మెరుగవుతుందని సూచించారు. కమాల్‌రెడ్డి, నరేందర్ ఆధ్వర్యంలో ఎన్‌ఎంయూ నేతలు, హనుమంతు నేతృత్వంలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ నేతలు బాజిరెడ్డిని కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment