సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర, దేశ ప్రజలకు సీఎం కె.చంద్రశేఖర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని ఆయన పేర్కొన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలు పురోగమిస్తున్నప్పటికీ.. మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో.. క్రీస్తు బోధ నలు ఆచరణీయమని స్పష్టం చేశారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం, సాటి మనుషులపై ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైనదని తెలిపారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
మంత్రుల శుభాకాంక్షలు
రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని ప్రార్థించారు. ఈ మేరకు వారు శని వారం వేర్వేరు ప్రకటనల్లో క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment