
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు, యూత్‌కి ఖుష్ ఖబర్ చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకలకు ప్రత్యేక అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది చివరిరోజున మద్యం షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది.
డిసెంబర్ 31న ఈ ప్రత్యేక అనుమతులు వర్తిస్తాయి. మద్యం దుకాణాలకు రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. అలాగే బార్స్, ఈవెంట్స్, పబ్‌లకు అర్దరాత్రి ఒంటిగంటకు వరకు అనుమతి ఇచ్చింది.
ఓవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని చోట్ల ఆంక్షలు విధిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతుల పేరిట సడలింపులు ఇవ్వడం విశేషం. అదే సమయంలో ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే!.
ఒమిక్రాన్ అలర్ట్: తెలంగాణలో మాస్క్ పెట్టుకోకుంటే కఠిన చర్యలే!
Comments
Please login to add a commentAdd a comment