
సీఎం ఇంటి వద్ద గుమ్మడి నర్సయ్య
నాలుగు దఫాలు ప్రయత్నించినా నిరాశే.. మాజీ ఎమ్మెల్యే నర్సయ్య ఆవేదన
ఇల్లెందు: ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఐదు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. నాలుగుసార్లు ప్రయత్నించినా సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ దొరకలేదని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఏకంగా సీఎం ఇంటికి వెళ్లినా అనుమతి లభించలేదని తెలిపారు.
ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. సెక్రటేరియట్ ఇనుప కంచెలు కూల్చివేసిన సీఎం.. ఒక మాజీ ఎమ్మెల్యేను లోపలికి రానివ్వరా? అని ప్రశ్నించారు. ఇల్లెందు నియోజకవర్గంలో పోడు భూములకు పట్టాలు, సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లెందు భూములకు పారించడం, రుణమాఫీ, కొత్త రుణాలు, రైతు భరోసా, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తదితర అంశాలపై సీఎంకు వినతిపత్రం ఇవ్వాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. దీన్ని బట్టీ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఎంత దూరంగా ఉంటున్నారో అర్థమవుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment