సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. జనవరి 25 నుంచి ఈ నెల 12 వరకు కరోనా పరీక్షల వివరాలను తెలంగాణ సర్కార్ హైకోర్టుకు తెలియజేసింది. జూన్ 3 నుంచి డిసెంబర్ వరకు 3 సీరం సర్వేలు జరిగాయని చెప్పింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండో దశ కరోనా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదన్న హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్తాన్ని ఆదేశించింది. రేపటి( శుక్రవారం) నుంచి కరోనా బులెటిన్ విడుదల చేయాలని తెలిపింది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. కరోనా కేసులపై తదుపరి విచారణను హైకోర్టు మార్చి 18కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment