
సాక్షి, హైదరాబాద్: ట్రెజరీ ఆండ్ అకౌంట్స్ శాఖలో ఇటీవలి కాలంలో ఇచ్చిన ఉద్యో గుల డిప్యుటేషన్లను రద్దు చేశారు. ఈ మేర కు శాఖ డైరెక్టర్ మూర్తి ఇంటర్నల్ మెమోను జారీ చేశారు. ప్రభుత్వ అను మతి ఉన్న డిప్యుటేషన్లు మినహా, అంతర్గత సర్దుబాట్ల కోసం ఇచ్చిన ఉత్తర్వులన్నిటినీ రద్దు చేశారు. ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగంలో ఉద్యోగుల ఫిర్యాదులపై సాక్షిలో వచ్చిన కథనాలపై డైరెక్టర్ మూర్తి బుధవారం
ఒక ప్రకటన విడుదల చేస్తూ డిప్యుటేషన్లు జారీ చేసే విషయంలో ఆర్థిక మంత్రి సిఫారసులు పాటించామని, పారదర్శకంగా ఇచ్చామని స్పష్టం చేశారు. నెట్‌వర్క్, అధిక బిల్లుల వల్లే సెల్‌ఫోన్ నెట్‌వర్క్ మార్చామని, ట్రెజరీ భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వ అనుమతి రాగానే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కంప్యూటర్ల మొరాయింపుపై ఫిర్యాదులు రాలేదని డైరెక్టర్ మూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment