సాక్షి, హైదరాబాద్: సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు అందజేసేలా ఆదేశించాలంటూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది.
ఈ వ్యవహారంపై ప్రభుత్వ వివరణ తీసుకున్న తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, హౌసింగ్ బోర్డు చైర్మన్, ఎండీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. వివరణ ఇవ్వాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment