
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని తలసాని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ పరమైన హోదాలో ఉన్న గవర్నర్.. వారి పరిమితులకు లోబడి మాట్లాడాలన్నారు. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అని,ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బాధ్యతా రాహిత్యం అవుతుందని, మీడియాతో గవర్నర్ రాజకీయాలు మాట్లాడకూడదని తలసాని అన్నారు. గవర్నర్ ఎలా గౌరవించాలో తమతో పాటు తమ సీఎంకు తెలుసన్నారు.