ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: అనుభవాల కోసం ఆరాటం, అడ్వంచరస్ అనుబంధాలపై ఆసక్తి...సిటీజనులను తొలుత డేటింగ్ తర్వాత చీటింగ్ వైపు నడిపిస్తున్నాయి. సిటిజనుల్లోని బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ వారధిగా మోసాలకు తెగబడుతున్న సంస్థలు, వ్యక్తులు ఎందరో.. ‘డియర్ సర్ వెల్కమ్ టూ డేటింగ్ సర్వీసెస్.. ఆర్యూ ఫీలింగ్ అలోన్ ఫైండ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లొకాలిటీ ఫర్ డేటింగ్, చాటింగ్, మీటింగ్... ఫర్ డిటైల్స్ ప్లీజ్ కాంటాక్ట్ నెం...’ అంటూ శ్రీనగర్‌కాలనీ వాసి సత్యేష్‌కి ఓ మొబైల్ సందేశం వచ్చింది. ఆ నెంబర్‌కి కాల్ చేస్తే.. తాము కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న తరహా ఒంటరి మహిళల కాంటాక్ట్ నెంబర్లు అందిస్తామని అవతలనుంచి ఓ అమ్మాయి చెప్పింది. హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై సహా ఏ నగరంలో కావాలంటే ఆ నగరంలో కాంటాక్టస్ ఇస్తామని చెప్పింది. మొత్తం 48 మంది నెంబర్లు ఇస్తామని, వారితో కావాల్సిన రిలేషన్ ఏర్పరచుకోవచ్చునంది. దీనికి గాను రూ.2100కి మించి తమకేమీ చెల్లించనక్కర్లేదంది.
చదవండి: ఢిల్లీ గ్యాంగ్.. లక్షలు వసూల్!
► ఉప్పల్‌లో నివసించే కాంత్‌కి ఎఫ్బీలో పరిచయమైన ఓ మహిళ ఫోన్‌సెక్స్‌కి రమ్మంటూ మెసెంజర్ ద్వారా ఆహ్వానించింది. అతను ఓకే అన గానే అలా సెక్స్ చాట్ చేయడానికి తనకు పావుగంటకు ఇంత చొప్పున చెల్లించాలని కోరింది.
► కూకట్‌పల్లి నివాసి రాజ్‌కి ఓ డేటింగ్ సైట్ ద్వారా పరిచయమైన పద్మ...అనే మహిళ కలవడానికి మాదాపూర్‌లోని ఖరీదైన కాస్మెటిక్స్ విక్రయ షోరూమ్ దగ్గరకు రమ్మంది. అక్కడ అతనితో కబుర్లు చెబుతూ రూ.8 వేల విలువైన షాపింగ్ చేసింది. బిల్ చెల్లించే టైమ్‌లో కాస్త డబ్బు తగ్గిందని రాజ్ మొత్తం బిల్ పే చేసేస్తే షాప్ బయటకు వెళ్లగానే ఇస్తానని నమ్మబలికి బయటకు రాగానే మస్కా కొట్టి తప్పించుకుంది.
కరోనా తర్వాత పుంజుకుంది..
లాక్‌డవున్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి డిజిటల్ ప్ర పంచాన్ని మరింతగా నగరవాసులకు సన్నిహితం చేశా యి. ఎక్కువ సేపు డిజిటల్ లోకంలో నివసించే అవసరాన్ని, అలవాటుని నేర్పించాయి. అవే ఇప్పుడు చీటర్స్‌కి వరంలా మారుతోంది. ముఖ్యంగా టీనేజర్స్, సింగిల్స్ ఎక్కువగా వీరి వలలో పడుతున్నారు. ప్రతి రో జూ ఒక నగరవాసి అయినా డేటింగ్ పేరిట దోపిడీకి గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు.
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన డేటింగ్ సేవల సమాచారం...పలువుర్ని చీటింగ్ బాధితులుగా మిగులుస్తోంది. బలహీన మనస్తత్వం ఉన్న మగవాళ్ల నుంచి డబ్బులు గుంజడమే థ్యేయంగా సాగుతున్న ఈ దందా తీవ్రత సదరు బలహీనత స్థాయిని బట్టి మారుతోంది. వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకున్నవారికి కూడా ఇది లాభసాటిగా మారింది. ఇలాంటి వారికి వేల రూపాయలు సమర్పించుకుని ఆనక తాము మోసపోయామని తెలిసినా కూడా కిక్కురుమనకుండా ఊరుకుంటున్నవారు నగరంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
చిక్కరు.. దొరకరు..
ఈ మోసాలకు పాల్పడుతున్నవారు టెక్నికల్‌గా అప్రమత్తంగా ఉంటున్నారు. వాట్సాప్‌లో చాట్ డిలీట్ కాదు కాబట్టి టెలిగ్రామ్ వాడడం వంటి అనేక జాగ్రత్తలను పాటిస్తూ.. సైబర్ చట్టాలకు చిక్కకుండా ఈ దోపిడీ సాగుతోంది. ఈ నేపధ్యంలో వీరి వలలో పడకుండా ఉండడానికి స్వీయ నియంత్రణే శరణ్యమని సైబర్ క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment