
కరోనా పొట్టగొట్టింది. ఆకలి రోడ్డెక్కింది. దాతల సాయం కోసం బతుకు‘బండి’ ఇలా బారులుదీరింది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లని రిక్షావాలాలు వీరంతా. సోమవారం వరంగల్ నగరంలో శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి.. పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి చేతుల మీదుగా రిక్షా కార్మికులకు 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. కార్మికులు తమ రిక్షాలతో సహా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్
Comments
Please login to add a commentAdd a comment