తిరుపతి: ప్రతి ఒక్కరికీ కూడు, గూడు కల్పించడమే సీఎం జగనన్న అజెండా అని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు. గడపగడపకు మహాపాదయాత్రలో భాగంగా సోమవారం జంగావాండ్లపల్లి పంచాయతీ పరిధి నుంచి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. గజమాలతో ఆత్మీయంగా సత్కరించారు.
ప్రతిగడపలో సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను అందించి వైఎస్‌ఆర్సీపీకి అండగా నిలవాలని కోరారు. మహా పాదయాత్ర కురవపల్లి, చినిగేపల్లి, జంగామాండ్లపల్లి, కూనివాండ్లపల్లి, అప్పేపల్లి, బొడేరెడ్డి గారి పల్లి వరకు కొనసాగింది. చిన్నగొట్టిగల్లు మండలం పరిధిలో పది గ్రామాలు కలయికతో జంగావాండ్లపల్లి పంచాయతీ ఏర్పాటైంది. ఇక్కడ 561 నివాసాలు 1,561 మంది జనాభా ఉన్నారు. పంచాయతీ అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొత్తం రూ.6 కోట్ల, 55 లక్షల, 76వేల, 530 రూపాయలు మంజూరు చేసినట్టు మోహిత్‌రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబం రూ.1.5 లక్షకు పైగా లబ్ధి పొందిందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ యుగంధర్‌రెడ్డి, డీసీఎంఎస్ సహదేవ్‌రెడ్డి, జెడ్పీటీసీ స్వరూపా, సర్పంచ్ విమల, ఉపసర్పంచ్ రఘునాథరెడ్డి, వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, పార్టీ డివిజనల్ అధ్యక్షులు అక్బర్, మహేంద్రరెడ్డి, పంచాయతీ కన్వీనర్‌లు జైపాల్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, ఎంపీడీఓ దేవేంద్రబాబు, తహసీల్దార్ లోకేశ్వరీ, ట్రాన్స్‌కో ఏడీ శివయ్య, పశుసంవర్థక శాఖ ఏడీ అవులప్రసాద్, సీఐ తులసీరామ్, ఎస్‌ఐ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment