
స్వామి,అమ్మవార్ల కల్యాణోత్సవంలో అర్చకులు
సైదాపురం: ధర్మప్రచార వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు మండల కేంద్రమైన సైదాపురానికి శ్రీపెనుశిల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం చేరుకుంది. వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి సారధ్యంలో.. మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీదేవి ఆశీనులైన రథం పురవీధుల్లో విహరిస్తుండగా.. భక్తుల గోవిందనామస్మరణలు మిన్నంటాయి. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వివాహ మండపానికి వేంచేపుయగా.. అక్కడ వేదపండితులు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. ఈఓ జనార్దన్‌రెడ్డి, సైదాపురం సొసైటీ అధ్యక్షులు గోగినేని శివకుమార్, జేసీఎస్ కన్వీనర్ గుంటమడుగు శ్రీనివాసులురాజు, సర్పంచ్ శారద, ఉపసర్పంచ్ శివకుమార్, నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment