జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు | - | Sakshi
Sakshi News home page

జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు

Published Wed, Feb 19 2025 12:43 AM | Last Updated on Wed, Feb 19 2025 12:43 AM

జిలకర

జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు

● మిల్లర్లు, దళారులతో అవస్థల దరువు ● ధరల్లేకుండా చేస్తున్న సిండికేట్లు ● పెట్టుబడులూ రాక అన్నదాతల అగచాట్లు

సూళ్లూరుపేట: జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ రబీ సీజన్‌లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. పండుగలు, పండుగ తర్వాత కురిసిన వానలతో పంట దిగుబడి తగ్గిపోయింది. దీనికితోడు మిల్లర్లు, దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం రేట్లు తగ్గించేశారు. సాధారణ రకాలు ప్రస్తుతం రూ.1,500 నుంచి రూ.1,700 పలుకుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బస్తా ధాన్యం రూ.2,200 దాకా పలికింది. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తే రైతులే తగ్గించి ఇస్తారనే ఆలోచనతో మిల్లర్లు నాటకాలాడుతున్నారు.

ధాన్యానికి, బియ్యానికి తేడా ఇలా..

రైతుల వద్ద తరుగు కింద బస్తాకు 80 కిలోలు లాగేసుకుంటున్నారు. దీనికి రైతులకు ఇచ్చేది ప్రస్తుతం రూ.1,600 నుంచి రూ.1,700 మాత్రమే. ఈ 80 కిలోల బస్తాను బియ్యంగా మిల్లులో ఆడిస్తే సుమారు 40 నుంచి 45 కిలోల బియ్యం వస్తాయి. 6 కిలోలు నూకలు, 20 కిలోల తవుడు, 2 కిలోలు పొట్టు వస్తుంది. 45 కిలోల బియ్యం ధర రూ.2,925, 6 కిలోలు నూకల రూ.240, 20 కిలోల తవుడురూ.700, రెండు కిలోల పొట్టు రూ.80 మొత్తం రూ.3,945 వరకు గిట్టుబాటు అవుతోంది.

ఆ హక్కు రైతుకు లేదా?

కష్ట నష్టాలకోర్చి పండించే ధాన్యానికి ఎంఆర్‌పీ నిర్ణయించే హక్కు రైతులకు లేకుండా పోయింది. అదే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి బియ్యంగా మార్చి దానికి ఏదో ఒక పేరుపెట్టి ఎంఆర్‌పీ నిర్ణయించే హక్కు ఉంది. అంటే ఇక్కడ కష్టపడి వస్తువును తయారు చేసేవారికన్నా కష్టపడకుండా మోసం చేసేవారికే ధర నిర్ణయించే హక్కు ఉండడం గమనార్హం.

ఎకరా సాగుకు రూ.35 వేల పెట్టుబడి

ఎకరా వరి సాగుకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి అవుతోంది. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో దిగుబడి ఆశాజనకంగా లేదు. దీంతో ఎకరానికి 20 నుంచి 30 బస్తాల్లోపు దిగుబడి వచ్చింది. ఆ ధాన్యానికి కూడా మద్దతు ధర లేకపోవడంతో వచ్చిన మొత్తం పెట్టుబడికే సరిపోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేకపోవడంతో అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

– సుంకర అల్లెయ్య, నాదెళ్లవారికండ్రి రైతు

నష్టాలే దిగుబడి

పంట పరవాలేదనిపించినా రేట్లు లేకపోవడంతో పెట్టుబడులకు కూడా చాలకుండా పోయింది. ధాన్యాన్ని మాత్రం అత్యంత చీఫ్‌గా అడుగుతున్నారు. మరి బియ్యం రేట్లు ఎందుకు తగ్గించడం లేదు. రైతులు పండించిన ధాన్యానికి మాత్రం రేట్లు లేకుండా చేస్తున్నారు. నిల్వ చేసుకోవడానికి షెడ్లు లేకపోవడంతో ఒకటికి సగానికి విక్రయించాల్సి వస్తోంది.

– లొక్కు రమణయ్య, డేగావారికండ్రిగ, రైతు

బియ్యం ధరలు ఇలా

గత ఏడాది సన్న రకాల బియ్యం రూ.1,150 నుంచి రూ.1,250 దాకా పలికాయి. ఈ నెలలో అమాంతంగా అదే రకాలు రూ.1350 నుంచి రూ.1,550 దాకా పెంచేశారు. ఇంకా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన బియ్యాన్ని రూ.1,600 దాకా విక్రయిస్తున్నారు. బస్తా 25 కిలోలు ఉందని చెబుతున్నారు. కానీ తూకం వేస్తే 23 లేకపోతే 24 కిలోలు వస్తున్నాయి. అదేమని నిలదీస్తే మిల్లుల్లోనే అలా వస్తున్నాయని బియ్యం వ్యాపారులు సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతమున్న ధరల ప్రకారం తీసుకుంటే కిలో బియ్యం సరాసరిన రూ.65 దాకా ఉంది. ఈ లెక్కన 24 కిలోలు, 23 కిలోలున్న బియ్యం బస్తాకి అదనంగా మరో రూ.65 నుంచి రూ.130 దాకా వినియోగదారులు నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించింది.

అరకొర ధర

జిల్లాలో ఈనెల మొదటి వారం నుంచి వరికోతలు ముమ్మంగా జరగుతున్నాయి. కానీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కంటితుడుపు చర్యగా ఏర్పాటు చేసింది. ఎంటీయూ–1010, ఎన్‌ఎల్‌ఆర్‌–145, ఆర్‌ఎన్‌ఆర్‌ఎం–7, ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, బీపీటీ–5240, ఎన్‌ఎల్‌ఆర్‌–33358, ఎన్‌ఎల్‌ఆర్‌ 33057 ధాన్యానికి గ్రేడ్‌–ఏ రకం క్వింటాల్‌ రూ.2,320 మద్దతు ధర ప్రకటించింది. అలాగే ఎంటీయూ–1001, సీఆర్‌–1009, ఎన్‌ఎల్‌ఆర్‌–34242, ఏడీటీ–37, ఎన్‌ఎల్‌ఆర్‌–286000 రకాలను సాధారణ రకాలుగా గుర్తించి క్వింటాల్‌ రూ.2,300 మద్దతు ధర ప్రకటించారు. నెమ్ముకింద ఒక కేజీ, గోనె సంచె కింద మరో కేజీ, తరుగు కింద ఇంకో రెండు కిలోల చొప్పున తీసేసి బస్తాకి 79 కిలోలు చొప్పున ధాన్యం సేకరిస్తున్నారు. అదేదో మిల్లర్లకే ఇచ్చేస్తే అక్కడికక్కడే డబ్లులు ఇస్తారనే ఉద్దేశంతో సన్నచిన్న కారు రైతులు కళ్లాల్లోనే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. పెద్ద రైతులుగా ఉన్న వారు వ్యవసాయ మార్కెట్‌ గోదాముల్లో స్టాక్‌ చేసుకుంటున్నారు.

ధాన్యానికి రేట్లు ఎందుకివ్వరు?

మార్కెట్లో కిలోబియ్యం రూ.65కు అమ్ముతున్నా రు. అదే ధాన్యానికి వచ్చే సరికి ధరలు ఎందుకు తగ్గిస్తున్నారు. కష్టనష్టాలెదు ర్కొని పండించే ధాన్యానికి రేట్లు నిర్ణయించుకునే హక్కులేదు. అదే మా వద్ద ధాన్యం కొనుగోలు చేసి బియ్యంగా మార్చుకుని అమ్మేవారికి మాత్రం రేట్లు నిర్ణయించుకునే హ క్కుంది. ఇదెక్కడి న్యాయం. – చెంగేణి సుధాకర్‌,

తడఖండ్రిగ, రైతు, తడ మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు 
1
1/4

జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు

జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు 
2
2/4

జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు

జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు 
3
3/4

జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు

జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు 
4
4/4

జిలకర మసూరీ రకానికి మద్దతు ధర కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement