తిరుమల: తిరుమలలోని క్యూకాంప్లెక్స్‌లో14 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 68,427 మంది స్వామివారిని దర్శించుకోగా 21,066 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.
రేపటి నుంచి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకలకు 21న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఆంకురార్పణ జరగనుంది. 22న స్వామివారి ధ్వజారోహణం, 26న మహాశివరాత్రి, రాత్రి నందిసేవ, 27న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరణితో తెప్పోత్సవం, 28న శివపార్వతుల కల్యాణం, మార్చి 2న గిరిప్రదక్షిణ, 4న పల్లకీసేవ, 5న ఏకాంతసేవ, 6న శాంతి అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment