ముత్యపు పందిరిపై శ్రీహరి
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలో కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీనివాసుడు ఉభయదేవేరులతో కలిసి గురువారం రాత్రి ముత్యపు పందిరిపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామి వారు యోగ ముద్రలో యోగనృసింహ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం వైఖానస ఆగమోక్తంగా నిత్యకై ంకర్యాలు నిర్వహించారు. తదుపరి స్వామి వారు సింహ వాహనాన్ని అధిష్టించి నాలుగు మాడవీధుల్లో విహరించారు. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈఓ గోపీనాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన్ రంగాచార్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో నేడు
కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగోరోజు అయిన శుక్రవారం ఉదయం స్వామివారు కల్పవృక్షవాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ముత్యపు పందిరిపై శ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment