జర్నలిజంలో ఏఐ పాత్ర కీలకం
● పీఐబీ ఏడీజీ రాజీందర్ చౌదరి
తిరుపతి సిటీ: ఆధునిక యుగంలో జర్నలిజం కొత్తపుంతలు తొక్కుతోందని, ఇందులో ఏఐ కీలకపాత్ర పోషిస్తోందని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్ రాజీందర్ చౌదరి తెలిపారు. పద్మావతి మహిళా వర్సిటీ జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం నిర్వహించిన మీడియా వర్కషాప్‌నకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వేవ్స్ 2025లో భాగంగా ఆన్‌లైన్ క్రియేట్ ఛాలెంజ్‌లలో యువత భారీగా పాల్గొనాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రాంతీయ మీడియాకు అందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలను చేరుకునేందుకు పీఐబీ పనిచేస్తోందన్నారు. ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు పీఐబీ పాత్ర కీలకమన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ వాణి, నాయశాస్త్ర విభాగాధిపతి ఆచార్య సీతాకుమారి, ప్రొఫెసర్ కిరణ్ ప్రసాద్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment