● ప్రభుత్వ, మఠం స్థలాలపై కన్నేసిన కార్పొరేటర్లు ● తిరుపతి నగరంలో ఖాళీ స్థలాలే లక్ష్యంగా చెలరేగిపోతున్న స్థానిక నేతలు ● ఆక్రమణలకు గురవుతున్న మఠం భూములు ● ఆక్రమణల కోసమే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరిన కార్పొరేటర్లు ● ఇప్పటికే నగరంలో పలుచోట్ల ప్రభ | - | Sakshi
Sakshi News home page

● ప్రభుత్వ, మఠం స్థలాలపై కన్నేసిన కార్పొరేటర్లు ● తిరుపతి నగరంలో ఖాళీ స్థలాలే లక్ష్యంగా చెలరేగిపోతున్న స్థానిక నేతలు ● ఆక్రమణలకు గురవుతున్న మఠం భూములు ● ఆక్రమణల కోసమే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరిన కార్పొరేటర్లు ● ఇప్పటికే నగరంలో పలుచోట్ల ప్రభ

Published Sat, Feb 22 2025 1:02 AM | Last Updated on Sat, Feb 22 2025 1:02 AM

● ప్ర

● ప్రభుత్వ, మఠం స్థలాలపై కన్నేసిన కార్పొరేటర్లు ● తిరుప

గత ప్రభుత్వంలో గెలిచిన ఇద్దరు

కార్పొరేటర్లు చెలరేగిపోతున్నారు. కూటమి పంచన చేరి కబ్జాలకు దిగుతున్నారు. తిరుపతి నగరంలో ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. అధికారుల ద్వారా

వివరాలు తెప్పించుకుని రాత్రికి రాత్రే

కంచె ఏర్పాటు చేస్తున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకుని కూటమి పార్టీ నేతలే మరింత ప్రోత్సహిస్తున్నట్టు స్థానికులు

చర్చించుకుంటున్నారు. అధికారులు కూడా తమకెందుకులే అని చూసీచూడనట్టు

వదిలేస్తున్నారు. ఇదే అదనుగా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ, మఠం భూములను కబ్జా చేస్తున్నారు. భూచోళ్ల

అరాచకాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

ఆక్రమించుకున్న భూమి చుట్టూ కంచె ఏర్పాటు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరంలో కూటమిలో చేరిన ఇద్దరు కార్పొరేటర్ల ఆక్రమణలకు అంతేలేకుండా పోతోంది. ఆక్రమణల కోసమే ఆ కార్పొరేటర్లు.. టీడీపీ, జనసేనలో చేరినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. తాజాగా కోట్ల రూపాయల విలువచేసే మఠం భూమిని ఆక్రమించారు. ఆ స్థలం చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేశారు. ఆ కంచైపెన చెత్తాచెదారం వేయరాదని బోర్డు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని చూసి స్థానికులు ఔరా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

వివరాల సేకరణతో సరి

కార్పొరేటర్ల ఆక్రమణ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఆ భూమి రెవెన్యూకి సంబంధించినదా? మఠానికి చెందినదా? అదేవిధంగా తిరుపతి రూరల్‌ మండలంలో ఉందా? అర్బన్‌లో ఉందా? అనే వివరాలు సేకరించి కార్పొరేషన్‌ అధికారులకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అక్రమించుకుంటున్న వారు ప్రస్తుతం అధికార పార్టీలో ఉండడంతో అధికారులు అటువైపు వెళ్లడానికి సాహసించడం లేదని ప్రచారం జరుగుతోంది.

కుఠిల రాజకీయం

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లుగా గెలిచి అధికారాన్ని అనుభవించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. టీడీపీ, జనసేన నేతల అవసరాన్ని ఆసరగా మలచుకుని ఆ పార్టీల్లో చేరిపోయారు. ఆ పార్టీల్లో చేరే సమయంలోనే వారి డిమాండ్లను కూటమి నేతల ముందుంచినట్లు తెలిసింది. డెప్యూటీ మేయర్‌ పదవిని ఎలాగైనా కై వశం చేసుకోవాలనే దురుద్దేశంతో కూటమి నేతలు వారి డిమాండ్లను అంగీకరించినట్టు చర్చసాగుతోంది. డెప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే.. పార్టీ మారిన కొందరు కార్పొరేటర్లు తమ ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించారు.

గత ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరంలో మాస్టర్‌ ప్లార్‌ రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ రోడ్ల ఏర్పాటు అనంతరం తిరుపతి నగరం రూపురేఖలు మారిపోయాయి. ఫలితంగా తిరుపతి నగరంలో నివాస స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే చెలరేగిపోతున్నారు. నగరంలో ప్రభుత్వ, పోరంబోకు, కాలువ, చెరువు పోరంబోకు, మఠం భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో.. అధికారుల ద్వారా వివరాలు తెప్పించుకుంటున్నారు. ఆపై రాత్రికి రాత్రే వాటిని ఆక్రమించేస్తున్నారు. ఇద్దరు ముఖ్యమైన కార్పొరేటర్లు తిరుపతి అర్బన్‌ పరిధిలోని కేశవాయన గుంట పరిధిలో రూ.కోట్ల విలువైన మఠం భూమిపై కన్నేశారు. సర్వే నం.57లో ఉన్న మఠం భూమి ఖాళీగా ఉండడంతో స్థానికులు చెత్తాచెదారం అందులో పడేసేవారు. కార్పొరేటర్లు ఆ ఖాళీ జాగాను శుభ్రం చేసి రాత్రికి రాత్రే కంచె ఏర్పాటు చేశారు

ప్రశ్నిస్తే దాడే!

కంచె ఏర్పాటు చేసే సమయంలో స్థానికుడు ఒకరు ప్రశ్నిస్తే అతనిపై దాడిచేసినట్లు విశ్వసనీయ సమాచారం. బాధితుడు పోలీసుకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వారం రోజులుగా విలువైన మఠం భూమి ఆక్రమణ పనులు సాగుతున్నాయి.

‘ముంచే’స్తారా?

ఇదే ప్రాంతంలో ఇది వరకే ఓ కార్పొరేటర్‌ అండదండలతో కాలువపైన నిర్మాణాలు చేపట్టి ఉన్నారు. అదే కార్పొరేటర్‌, మరో కార్పొరేటర్‌ కలిసి ఖాళీగా ఉన్న భూమిని ఆక్రమించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ భూమి ఆక్రమణ పూర్తయితే వరద నీరు వస్తే ఆ ప్రాంతం జలదిగ్భందంలో చిక్కుకోక తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి వరద ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుచున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
● ప్రభుత్వ, మఠం స్థలాలపై కన్నేసిన కార్పొరేటర్లు ● తిరుప1
1/3

● ప్రభుత్వ, మఠం స్థలాలపై కన్నేసిన కార్పొరేటర్లు ● తిరుప

● ప్రభుత్వ, మఠం స్థలాలపై కన్నేసిన కార్పొరేటర్లు ● తిరుప2
2/3

● ప్రభుత్వ, మఠం స్థలాలపై కన్నేసిన కార్పొరేటర్లు ● తిరుప

● ప్రభుత్వ, మఠం స్థలాలపై కన్నేసిన కార్పొరేటర్లు ● తిరుప3
3/3

● ప్రభుత్వ, మఠం స్థలాలపై కన్నేసిన కార్పొరేటర్లు ● తిరుప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement