అట్టహాసంగా తిరుత్సవ్–2025
రేణిగుంట(ఏర్పేడు): ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో శుక్రవారం తిరుత్సవ్–2025 పేరిట నిర్వహించిన టెక్నో కల్చరల్ ఫెస్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫె సర్ కేఎన్.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా తెలుగు సినీ సంగీత దర్శకులు ఎస్‌ఎస్ తమన్ హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్.సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులే నిర్వహించే ఈ ఉత్సవం ఈ సారి అద్వితీయంగా ప్రారంభమైందన్నారు. ఐఐటీ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అతిథులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. అంతకుముందు ఉదయం విద్యార్థులు స్క్వాడ్ గేమ్స్, జర్నీ ఫర్ రిచెస్, అనలాగ్ మిస్టరీ వంటి జిజ్ఞాసతో కూడిన ఆటలను ఆడి ప్రశంసలుందుకున్నారు. సరాగం బ్యాండ్ ప్రదర్శన, లీప్స్ అండ్ బీట్స్ నృత్య ప్రదర్శనలు అలరించాయి.
నూతన ఆవిష్కరణలకు ఐఐటీ కేంద్రబిందువు కావాలన్న వక్తలు
సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు
అట్టహాసంగా తిరుత్సవ్–2025
అట్టహాసంగా తిరుత్సవ్–2025
అట్టహాసంగా తిరుత్సవ్–2025
అట్టహాసంగా తిరుత్సవ్–2025
అట్టహాసంగా తిరుత్సవ్–2025
Comments
Please login to add a commentAdd a comment