కారును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
● చిన్నారి మృతి ● మరో ఇద్దరికి గాయాలు
తిరుపతి రూరల్: నాయుడుపేట – పూతలపట్టు జాతీరహదారి రామచంద్రాపురం జంక్షన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా ముగ్గురు గాయాలపాలయ్యారు. పోలీసుల సమాచారం మేరకు.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన వేణుగోపాల్ భార్య అశ్విని, కుమార్తె హరిప్రియతో కలసి కారులో శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని తిరుమల వెళ్లేందుకు ఆర్‌సీపురం జంక్షన్ వద్దకు చేరుకున్నారు. జాతీయ రహదారి నుంచి తిరుపతి నగరంలోకి మలుపు తీసుకునే క్రమంలో బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నాలుగేళ్ల చిన్నారి హరిప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. తిరుపతి రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment