స్కిల్‌డెవలప్‌మెంట్‌తోనే ఉద్యోగాలు
తిరుపతి సిటీ: ఇంజినీరింగ్ విద్యార్థినులు అకడమిక్ విద్యతో పాటు ప్రధానంగా ఆధునిక సాంకేతికతపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని గాదంకి ఎన్‌ఏఆర్‌ఎల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ హెచ్‌ఓడీ డాక్టర్ కేకేఎస్‌వీవీ ప్రకాష్‌రావు సూచించారు. పద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో విద్యుత్సవ్–2025 పేరుతో రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభోత్సవానికి శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ మల్లికార్జున, ప్రొఫెసర్ వీరారెడ్డి, అధ్యాపకులు హిమబిందు, కే.షాలిని, పార్థవిసాయి పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్టైఫండ్‌కు దరఖాస్తులు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సౌత్ జోన్ స్పోర్ట్స్ స్టైఫండ్ కోసం అర్హత కలిగిన ప్రతిభావంతులైన క్రీడాకారులు 2025–26 సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్ తెలిపారు. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్‌కు సంబంధించి బాలురు, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాలకు సంబంధించి బాలబాలికలు అర్హులని తెలిపారు. 15 నుంచి 18, 18 నుంచి 24 ఏళ్లలోపు వారు మార్చి 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎఫ్‌సీఐ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment