గడ్డు కాలం
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం దండగలా మారింది. అన్నదాతలకు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా తయారైంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నాయి. నకిలీ ఎరువులు.. పురుగు మందులతో చీడపీడలు చుట్టుముట్టాయి. చివరకు ప్రాణంగా చూసుకునే భూమిని వదిలి వెళ్లే పరిస్థితులు తలెత్తాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు రైతు గంగిరెడ్డి దామోదరరెడ్డి. కోట మండలం దక్షిణపాళెం గ్రామానికి చెందిన దామోదరరెడ్డికి వాకాడు మండలం కాశీపురం సమీపంలో 3.5 ఎకరాల పొలం ఉంది. దాదాపు 30 ఏళ్లుగా సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అదేం చిత్రమో కానీ, 2015–19 మధ్య కాలంలో వరుసగా వ్యవసాయంలో నష్టాలు చవిచూశారు. సుమారు రూ.5లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయారు. అదే 2019–24 నడుమ ప్రకృతి కరుణించడంతో సమృద్ధిగా పంట దిగుబడి సాధించారు. అప్పుల బాధ నుంచి విముక్తులయ్యారు. ఇంతలో మళ్లీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. 8 నెలలుగా సంక్షేమ సాయం దూరమైంది. పాపం దామోదరరెడ్డిని వ్యవసాయం వెక్కిరించింది. . దీంతో ఆయన తనకు ఇష్టమైన సాగును వదలి.. పాల వ్యాపారం దిశగా అడుగులు వేశారు. ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్నారు. – వాకాడు
గడ్డు కాలం
Comments
Please login to add a commentAdd a comment