అంతా మా ఇష్టం
ప్రకృతి వనరులను కూటమి నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల అండతో ఇష్జారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడ్డుపడిన అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు.ఈ క్రమంలోనే గూడూరు శివారులోని జగనన్న లేఅవుట్ దగ్గర ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు చేపట్టారు. దీనిపై సాక్షి పత్రికలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ ప్రవేశించకుండా ట్రెంచ్ ఏర్పాటు చేశారు. తదనంతరం వర్షాలు కురవడంతో గోతులు పూడిపోవడంతో కూటమి నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. అక్రమంగా మట్టి తరలింపుకు శ్రీకారం చుట్టారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు వీఆర్‌ఓ బుధవారం ఘటనాస్థలానికి వెళ్లి మూడు ట్రాక్టర్లు, ఓ జేసీబీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో వెంటనే స్థానిక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. తమ అనుచరులకు చెందిన వాహనాలు సీజ్ చేయడంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కేసుల నమోదుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరేందుక యత్నించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. – చిల్లకూరు
అంతా మా ఇష్టం
Comments
Please login to add a commentAdd a comment