
రెవెన్యూకు హైకోర్టు అక్షింతలు
సైదాపురం: రెవెన్యూ అధికారులకు హైకోర్టు అక్షింతలు వేసింది. రైతులు సాగు చేసుకుంటున్న భూములపై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులు, పేదలు సంతోషం వ్యక్తం చస్తున్నారు. వివరాలు.. మండల కేంద్రమైన సైదాపురంలోని 793 ఏ సర్వే నెంబర్‌లో 114 ఎకరాల భూమి ఉంది. గతంలో ఆ భూమి మైనింగ్ లీజులో ఉండేది. ఈ క్రమంలో గడిచిన కొన్నేళ్లుగా మైనింగ్ లీజు గడువు కూడా ముగిసింది. ఆ భూమి సమీపంలోనే కమ్మవారిపల్లి గ్రామం ఉండడంతో ఆ గ్రామానికి చెందిన ఐదు గిరిజన కుటుంబాలతో పాటు మరో 10 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఆ భూములను ఆక్రమించుకున్నారు. ఒక్కో కుటుంబం వారు ఎకరా నుంచి రెండెకరాల వంతున ఆక్రమించుకుని నిమ్మ తోటలను సాగు చేసుకుంటున్నారు.
అధికారుల అత్యుత్సాహం
కూటమి నేతల ప్రోత్సాహంతో రెవెన్యూ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పేదలు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు వారి వైపే రావడంతో పేదలు సంబరాల్లో మునిగిపోయారు.

రెవెన్యూకు హైకోర్టు అక్షింతలు
Comments
Please login to add a commentAdd a comment