
మహిళా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమ
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 40 ఏళ్లపాటు బోధన, పరిశోధన రంగాల్లో పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్‌తో పాటు స్టేట్ బెస్ట్ టీచర్‌గా ప్రశంసలు పొందారు. మహిళా వర్సిటీకి రెక్టార్‌గా, ఇన్‌చార్జి వీసీగా పనిచేసిన ఆమెకు వర్సిటీ పాలనపై అవగాహన ఉంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌గా వీసీగా కొనసాగుతున్న ఆమె బుధవారం పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధకారితే లక్ష్యంగా వర్సిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు.
భూసేకరణ పనులు వేగవంతం
తిరుపతి అర్బన్:అధికారులు సమన్వయంతో భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన మంగళవారం భూసేకరణపై అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానంగా రెవెన్యూ, జాతీయ రహదారులకు చెందిన అధికారులు సమష్టిగా భూసేకరణలో పు రోగతి చూపాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారులతోపాటు రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. భూసేకరణలో ప్రధానంగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా, సూళ్లూరుపేట ఆర్టీవో కిరణ్మయి, శ్రీకాళహస్తి ఆర్టీవో భానుప్రకాష్‌రెడ్డి, ఆయా మండల తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. కడప–రేణిగుంట, తిరుపతి–మదనపల్లి , రేణిగుంట–నాయుడు పేట ఆరు లేన్ల రహదారుల నిర్మాణం, తిరుపతి బైపాస్ పనులు, రేణిగుంట నుంచి చైన్నెకి వెళ్లే నాలుగు లేన్ల రహదారి పనులు వేగవంతం చేయాలని వివరించారు. ఏపీఐఐసీ జెడ్‌ఎం విజమ్‌భరత్ రెడ్డి, నేషనల్ హైవే ిపీడీలు తిరుపతి వెంకటేష్, నెల్లూరు ఎంకే చౌదరి, చైన్నె రవీంద్రరావు, డెప్యూటీ తహసీల్దార్ భాస్కర్ పాల్గొన్నారు.
అట్టహాసంగా
శివరాత్రి బ్రహ్మోత్సవాలు
నాగలాపురం: మండలంలోని సురుటుపళ్లి గ్రామంలో ప్రదోష క్షేత్రంగా బాసిలుతున్న శ్రీపళ్లికొండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కార్య నిర్వహణాధికారి లత ఆధ్వర్యంలో తొలిరోజు గ్రామ దేవత పొన్నెమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేశన్ నేతృత్వంలో అర్చక బృందం ఉదయం 7.30 గంటలకు గ్రామ దేవత పొన్నెమ్మకు అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటలకు వాస్తు శాంతి జరిపారు. రాత్రి పొన్నెమ్మ ఉత్సవమూర్తిని మూషిక వాహనంపై మాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు కర్పూర నీరాజనాలు అర్పించారు.

మహిళా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమ

మహిళా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమ
Comments
Please login to add a commentAdd a comment