
మేనకూరులో యువకుడి ఆత్మహత్య
నాయుడుపేట టౌన్: మేనకూరు గ్రామంలో నివాసం ఉంటున్న అక్కుపల్లి సాయి(24) మంగళవారం తన ఇంటిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామానికి చెందిన సాయి ఏడాదిగా మేనకూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ప్రైవేటు పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం డ్యూటీ ముగించుకుని రాత్రి మేనకూరులో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటలు అవుతున్నా సాయి పరిశ్రమ వద్దకు రాలేదు. దీంతో కాంట్రాక్టర్ మేనకూరులో సాయి ఇంటి వద్దకు సిబ్బందిని పంపించారు. తలుపులు తెరవక పొవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ బాబి సంఘటన స్ధలం వద్దకు చేరుకుని పరిశీలించిగా సాయి ఇంటి లోపల ఫ్యానుకు ఉరేసుకుని ఉండడాన్ని గుర్తించారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. వారు వచ్చిన తరువాత ఇంటి తలుపును పగలగొట్టి సాయి మృతదేహాన్ని కిందకి దించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. సాయి మృతదేహానికి నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment