
● అంతర్జాతీయ ఆలయాల సదస్సులో వక్తలు
తిరుపతి మంగళం: ఆలయాల భద్రత, బలోపేతమే లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. తిరుపతి మంగళంలోని ఆశాకన్వెన్షన్ హాలులో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్–2025) కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన మంగళవారం ఆలయాల ప్రతినిధులతోపాటు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు కర్ణాటక, కేరళ రాష్ట్రాల గ్రామీణ ఆలయా ల నిర్వాహకులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఐటీసీఎక్స్ వ్యవస్థాపకుడు గిరీష్ వాసుదేవ్ కులకర్ణి ఆధ్వర్యంలో షిర్డీ సాయి సంస్థాన్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ వహిద్ వెలింగ్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, డెవలెప్మెంట్, రీసెర్చ్ డైరెక్టర్ ఉదయ్ పలుంఖేతో నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ ఆలోచింపజేసింది. షిర్డీసాయి టెంపుల్ నిర్వహణ, చారిటీపై షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్‌పర్సన్ అంజూషెండే, సీఈవో గోరక్ష్ గాడిల్కర్ ఆధ్వర్యంలో చర్చ నిర్వహించారు.
ప్రభుత్వాల పాత్రపై అవగాహన
కోవిలూరు మఠానికి చెందిన నారాయణదేశికస్వామి ఆధ్వర్యంలో సమాజాభివృద్ధికి దేవాలయాల ద్వారా అనుసరించాల్సిన పద్ధతులు, ఆలయాల నిర్వహణలో ప్రభుత్వాల పాత్రను వివరించారు. కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఆర్పీ.రవిశంకర్, అఖిల భారత శ్రీవాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ పీఎన్.గోవిందరాజులు ఆధ్వర్యంలో ది జర్నీ ఆఫ్ వారణాసి టెంపుల్స్ అనే అంశంపై అవగాహన కల్పించారు. దాతలు జె.శేఖర్‌రెడ్డి, దొర స్వామిలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
ఆలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలి
తిరుపతి సిటీ: దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉందని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఐటీసీ ఎక్స్‌పోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశీయ, అంతర్జాతీయ ఆలయాలకు చెందిన వివిధ తరాల సనాతన ధర్మ సంరక్షకులను, పరిచర్యులను ఒకే వేదిక మీదకు చేర్చడం శుభపరిణామమన్నారు. తమిళనాడులో బీజేపీ అధికారం చేపట్టగానే 44,121 ఆలయాలకు హెచ్‌ఆర్ అండ్ సీఈ యాక్ట్ నుంచి విముక్తి కలిగిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టినట్టు గుర్తుచేశారు.
త్వరలో అత్యున్నత ధార్మిక సంస్థ
రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను ప్రొత్సహించి ధార్మిక దానధర్మాలను సులభతరం చేయడం, సమన్వయం, నియంత్రించడం కోసం రాష్ట్ర రాజ్యధార్మిక పరిషత్‌లో అత్యున్నత సంస్థను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే చెప్పారు. రాజ్య ధార్మిక పరిషత్‌లో మత నాయకులు తదితరులు ఉంటారని చెప్పారు.
ఆకట్టుకున్న స్టాళ్లు
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 60 స్టాళ్లు సందర్శకును విశేషంగా ఆకట్టుకున్నాయి. సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ ఆలయాల దేవుళ్ల విగ్రహాలు, కలంకారి చిత్రాలు, శారీలు, గోల్డ్ కాయిన్స్, డ్రోన్ల ద్వారా మంటలను అదుపు చేయడం తదితరాలు మంత్రముగ్దులను చేశాయి.

● అంతర్జాతీయ ఆలయాల సదస్సులో వక్తలు

● అంతర్జాతీయ ఆలయాల సదస్సులో వక్తలు

● అంతర్జాతీయ ఆలయాల సదస్సులో వక్తలు

● అంతర్జాతీయ ఆలయాల సదస్సులో వక్తలు

● అంతర్జాతీయ ఆలయాల సదస్సులో వక్తలు
Comments
Please login to add a commentAdd a comment