మత్స్యకారులకు ఏం చేశారో చెప్పండి?
● కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తోంది ● మత్స్యకార భరోసా లేదు.. రాయితీలు లేవు ● తిరుపతి చేపలను తమిళనాడు వారు దోచుకుపోతున్నారు ● ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో సమస్యల ఏకరువు
తిరుపతి అర్బన్: ఇప్పటి వరకు మత్స్యకారులకు కూట మి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ పలువురు మత్స్యకారులు అధికారులను నిలదీశారు. కలెక్టరేట్‌లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్య శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సమక్షంలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు కార్యక్రమంలో భాగస్వాములయ్యా రు. అనంతరం వారు మాట్లాడుతూ గత జూన్‌లో 3,786 మంది మత్స్యకారులకు ఇవ్వాల్సిన భరోసా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం న్యాయమా..?అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల బోట్లు, వలలు కొనుగోలుకు 90 శాతం రాయితీ, బీసీలకు 75 శాతం రాయితీ ఇస్తామని.. ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు మత్స్యకారులు హైస్పీడ్ బోట్లతో తిరుపతి జిల్లా సముద్రతీర ప్రాంతంలోని చేపలను దోచుకుపోతు న్నా కట్టడి చేసేవారు లేరన్నారు. జిల్లా మత్స్యకారుల వద్ద ఉన్న సన్న బోట్లకు చేపలు దొరకడం లేదన్నారు. జిల్లాలో 100 మత్స్యకారుల సొసైటీలు ఉన్నాయని, వాళ్లు మాత్రమే చేపలు పట్టుకోవాల్సి ఉందన్నారు. ప్రతి ఏటా ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో బాపట్ల నుంచి లక్ష చేప పిల్లలను తిరుపతికి దిగుమ తి చేసి జాలర్ల సమక్షంలో వాటిని పెంచిన తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాల్లో చెరువుల్లో వదిలిపెట్టేవారన్నారు. మేలు రకమైన చేప పిల్లలు కావడంతో మార్చి, ఏప్రిల్‌లో మంచి దిగుపడి వచ్చేదన్నారు. అయితే ఈ ఏడాది ఆ ఊసేలేద న్నారు. పులికాట్ ముఖద్వారాల్లోని పూడిక తీత పనులు ఇంతవరకు చేపట్టలేదన్నారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకుంటూ మత్స్యకారుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 80 బోట్లు ఆధారంగా 4,203 మంది మత్స్యకారులు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి నాగరాజు, మత్స్యకార సంఘ జిల్లా అధ్యక్షులు జీవీ.రత్నం, పులికాట్ సరస్సు మత్స్యకారుల సంఘం నేత బొమ్మన శ్రీధర్, హేచరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాగర్‌రెడ్డి, మత్స్య, ఆక్వా రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment