
బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ
మమ్మీడాడీ త్వరగా వచ్చేయండి!
పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట వద్ద శనివారం ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.
ఎవరే అతగాడు?
తనను ఎవరో చంపేందుకు వస్తున్నారంటూ పీలేరు నుంచి తిరుపతికి వస్తున్న కర్ణాటక బస్సులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు.
ప్రమాదరహిత డ్రైవింగ్‌కు ప్రశంసలు
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వరదయ్యపాళెం మండలంలో వరి పైరు కోస్తున్న యంత్రం
కష్టం వృథా
ఈ ఏడాది వ్యవసాయం కష్టంగా మారింది. దిగుబడి తగ్గడంతో పాటు గత ఏడాదితో పోల్చుకుంటే బస్తాకు రూ. 400 నుంచి రూ. 500 వరకు ధర కూడా తగ్గిపోయింది. అటు గిట్టుబాటు ధరలేక, ఇటు తగ్గిన దిగుబడి తీవ్రంగా నష్టాల్లో ముంచింది. నాకున్న మూడెకరాల్లో వరి పంట సాగు చేశా. 60 బస్తాల దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ.25వేల చొప్పున పెట్టుబడి పోను రూ. 10వేల వరకు నష్టం వచ్చింది. మా కష్టం కూడా వృథాగా మారింది. – గోపాల్, రైతు,
కంచరపాళెం, వరదయ్యపాళెం మండలం
ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ ఏడాది 10 ఎకరాల్లో 12కి 71 సన్నరకం వరి పంట సాగు చేశా. 230 బస్తాలు దిగుబడి వచ్చింది. అయితే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం విక్రయించలేకపోయా. బస్తా రూ. 1,600 చొప్పున ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నా. ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఉంటే బస్తా రూ. 1,750లకు కొనుగోలు చేసి ఉండేవారు. సకాలంలో అధికారులు స్పందించని కారణంగా బస్తాకు రూ. 150 చొప్పున నష్టపోయా. అలాగే ఈ ఏడాది దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో 8 ఎకరాల కౌలు భూమి సాగు చేసి దెబ్బతిన్నా. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – చెంచురామయ్య, రైతు,
కంచరపాళెం, వరదయ్యపాళెం మండలం
వాతావరణ పరిస్థితులే..
ఈ ఏడాది ఎక్కువ వర్షాలు, మంచు కారణంగా దిగుబడులు తగ్గాయి. అంతేకాక రైతులు భూసార పరిస్థితులను బట్టి పంటలు సాగు చేయాలి. కొత్త రకాలపై దృష్టి పెట్టడం కూడా దిగుబడి తగ్గడానికి కారణం. వరి పంట సాగు సమయంలో వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకోవాలి.
– సుబ్రమణ్యం, ఏడీఏ,
సత్యవేడు వ్యవసాయశాఖ డివిజన్
పరిసరాల శుభ్రతే లక్ష్యం
తిరుపతి అర్బన్: కలెక్టరేట్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్‌రెడ్డి సిబ్బందికి సూచించారు. కలెక్టరేట్‌లో ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా కలెక్టరేట్ ఉద్యోగులతో దేవేందర్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉద్యోగులు పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్ ఏఓ భారతి, డీఎంహెచ్‌ఓ, డీడీ సోషల్ వెల్ఫేర్ అనీల్‌కుమార్‌రెడ్డి, జిల్లా సర్వేయర్ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
సిరులతల్లి సేవలో
జీయర్ స్వాములు
తిరుపతి రూరల్ : తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని శనివారం విజయవాడకు చెందిన అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి, కృష్ణాజిల్లాకు ఉపమాకకు చెందిన బృందావన రామానుజ జీయర్ స్వామి, కర్ణాటక మేలుకోటకు చెందిన శఠకోపముని రామానుజ జీయర్ స్వామి వారు సేవించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు మహా ద్వారం వద్ద సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పలు రైళ్లు దారి మళ్లింపు
గూడూరు రూరల్: చైన్నె– గుమ్మడిపూండి వద్ద రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా ఈ నెల 16, 19, 21 తేదీల్లో పలు రైళ్లు దారి మళ్లించనున్నట్టు గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నుంచి చైన్నె వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ గూడూరు వరకు మాత్రమే వస్తుందని, తిరిగి సాయంత్రం గూడూరు నుంచి విజయవాడకు బయలుదేరుతుందని తెలిపారు. అదేవిధంగా మూడు రోజులపాటు చైన్నె నుంచి వచ్చే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు రేణిగుంట మీదుగా గూడూరుకు వస్తుందని వెల్లడించారు. ఇంకా పలు రైళ్లు దారి మళ్లించనున్నట్టు తెలిపారు.
కంచి పీఠాధిపతికి ఆహ్వానం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిని శనివారం ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆదిదంపతుల చిత్రపటంతోపాటు ఆహ్వానపత్రికను పీఠాధిపతికి అందించారు. ఆలయ డిప్యూటీ ఈఓ ఎన్‌ఆర్ కష్ణారెడ్డి, ప్రధాన అర్చకుడు కరుణాకరన్ గురుకుల్ పాల్గొన్నారు.
వరి పంటను ప్రతికూల వాతావరణం నిండా ముంచేసింది. దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఆరుగాల కష్టం అన్నదాతకు అప్పులనే మిగుల్చుతోంది. ఐదేళ్లపాటు ఆదాయం అందించిన వరి సాగు ఈ ఏడాది నష్టాల బాట పడుతోంది. ప్రధానంగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. పెట్టుబడి సైతం రాకపోవడంతోపాటు రూ.10వేల వరకు అదనపు భారం పడుతోంది. కంకి దశలో కురిసిన అకాల వర్షం.. అధిక మంచు కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరతోపాటు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతోంది.
వరదయ్యపాళెం: జిల్లాలో రైతులు రబీ సీజన్‌కు సంబంధించి మొత్తం 83,125 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినప్పటికీ పంట దిగుబడి తగ్గడంతో రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. గతంలో ఎకరానికి 32–35 బస్తాల దిగుబడి వచ్చేది. ఈ ఏడాది సకాలంలో నీరందినప్పటికీ కంకి దశలో కురిసిన అకాల వర్షం, అధిక మంచు అన్నదాతలను కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ ప్రభావంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది.
ఆశలపై నీళ్లు
ఈ ఏడాది నీటి వసతి బాగుండడంతో పంట పచ్చగా, ఏపుగా పెరిగింది. ఎకరాకు 30–35 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. పంటను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అనూహ్యంగా కురిసిన వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతానికి ఎకరానికి 20–25 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోంది. సగటున 23 బస్తాలు దిగుబడి ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా. ఎకరం సాగు చేసేందుకు రూ. 25వేలు వరకు పెట్టుబడుల కింద రైతులు ఖర్చు చేశారు. పెట్టుబడిపై వడ్డీ ఇందుకు అదనం. కౌలు రైతు ఎకరానికి 6 బస్తాలు కౌలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఆ రైతుకు మిగిలేది 10–15 బస్తాలు మాత్రమే.
సూళ్లూరుపేట: ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్ పిలుపునిచ్చారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో స్వచ్ఛత పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు–గుడ్డ సంచులే ముద్దు అని నినాదాలు చేస్తే షార్ కేంద్రంలోనే కాకుండా డీఓఎస్ కాలనీ, డీఆర్‌డీఎల్ కాలనీ, కేఆర్‌పీ కాలనీల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం షార్ ఉద్యోగులంతా కలిసి తెల్లటి దుస్తులు ధరించి ఫాగింగ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. షార్ కంట్రోలర్ వీ.శ్రీనివాసులురెడ్డి, పులికాట్ నగర్ నుంచి వీ.కృతివాసన్, పినాకినీ నగర్ నుంచి పీ.వెంకటరెడ్డి, స్వర్ణముఖినగర్ ఎస్.ముత్తు చెళియన్ పాల్గొని అవగాహన ర్యాలీలను నిర్వహించారు.
తిరుపతి అర్బన్ : రహదారి భద్రతా మాసోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా తిరుపతి బస్టాండ్‌లో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్‌టీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కోరారు. మీపై నమ్మకంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తున్నట్లు గుర్తుంచుకోవాలని చెప్పారు. చిన్నపాటి ప్రమాదాలకు సైతం అవకాశం లేకుండా విధులు నిర్వర్తించిన వారిని అభినందించారు. డీపీటీఓ నరసింహులు మాట్లాడుతూ ఆర్టీసీలో సురక్షితంగా ప్రయాణించవచ్చని ప్రజలు భావిస్తారని, వారి నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి డ్రైవర్‌పై ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 11 డిపోల నుంచి 33 మంది, జిల్లా స్థాయిలో మరో ముగ్గురు డ్రైవర్లకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందించారు. డీసీటీఎం విశ్వనాథం, ఏటీఎం డీఆర్ నాయుడు, డీఎంలు బాలాజీ, భాస్కర్‌రావు, హరిబాబు, మునిచంద్ర, పీఓ షహజాద్ పాల్గొన్నారు.
సంతోషంగా ఉంది
ఆర్టీసీలో 34 ఏళ్ల క్రితం చేరా. ఇప్పటి వరకు నా సర్వీస్‌లో చిన్నపాటి ప్రమాదం కూడా చేయలేదు. దేవుడు తోడుగా ఉన్నాడని భావిస్తున్నా. బాధ్యత గా డ్రైవింగ్ చేయడంతోపాటు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తా. మా సేవలను ఆర్టీసీ పెద్దలు గుర్తించి సన్మానం చేయడం సంతోషంగా ఉంది. – కేవీ సుధాకర్, డ్రైవర్, సత్యవేడు డిపో
బాధ్యతగా విధులు
ఆర్టీసీలో 33 ఏళ్లుగా పనిచేస్తున్నా. బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్నా. భగవంతుడి ఆశీస్సులతో ఇప్పటి వరకు చిన్నపాటి ప్రమాదం కూడా చేయలేదు. డ్రైవర్లు డ్యూటీపైనే దృష్టి పెట్టాలి, ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. మా సేవలను అధికారులు గుర్తించడం మా బాధ్యతను మరింత పెంచింది. – బి.కృష్ణ, డ్రైవర్, పుత్తూరు డిపో
●
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
నిండా మునిగిన అన్నదాతలు
ప్రతికూల వాతావరణంతో
ఆవిరైన ఆశలు
వరి సాగులో దిగుబడి తగ్గడంతో
ఎదురవుతున్న నష్టాలు
పెట్టుబడి సైతం చేతికందక
ఆందోళనలో రైతులు
జిల్లాలో వరి సాగు వివరాలు
సబ్ డివిజన్ పేరు సాగు విస్తీర్ణం
(హెక్టార్లలో)
సత్యవేడు 9,616
గూడూరు 15,624
వెంకటగిరి 8,700
శ్రీకాళహస్తి 16,962
సూళ్లూరుపేట 11,200
తిరుపతి 2,200
నాయుడు పేట 12,023
పుత్తూరు 6,800
సాగు చేసిన రకాలు
వరి పంట విస్తీర్ణం (హెక్టార్లలో)
ఆర్‌ఎన్‌ఆర్ (15048) 25,500 బిపిటి (5204) 22,000
ఎమ్‌టియూ 12 కి 71 13,000
16 కి 38 సన్నాలు 24,200

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ
Comments
Please login to add a commentAdd a comment