
స్విమ్స్‌లో నిరంతర వైద్య విద్య కార్యక్రమం
తిరుపతి తుడా:స్విమ్స్ ఇమ్యూనో హెమటాలజీ, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్, ఎమర్జెన్సీ మెడిసిన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పద్మావతి ఆడిటోరియంలో నిరంతర వైద్య విద్య కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్‌బాబు ప్లాస్మాఫెరిసిస్ చికిత్స, ప్లాస్మా మార్పిడి వంటి విషయాలపై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డాక్టర్ ప్రవీణ్, డాక్ట ర్ రోహిత్ గుప్తా, స్విమ్స్ బ్లడ్ బ్యాంక్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్‌బాబు, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ క్రిష్ణసింహారెడ్డి, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.