కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీలోని ఎంపీపటేల్‌గూడకు చెందిన పట్నం నరేశ్‌కి పన్నెండేళ్ల క్రితం ఉమాతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాఫీగా సాగుతున్న కాపురంలో అనుమానం పెనుభూతంగా మారింది. దీంతో భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుండేవారు. ఐదు నెలల క్రితం నరేశ్(36) మద్యం తాగి భార్యను కొడుతున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమ్మగారింటికి వెళ్లిపోవడంతో రెండు నెలల క్రితం పెద్దలు ఒప్పించి కాపురం చేయించారు. ఆదివారం రాత్రి 10 గంటలకు మళ్లీ భార్యాభర్తలు గొడవ పడడంతో 100 ఫోన్ చేశారు. పోలీసులు ఇంటికి చేరుకొని నచ్చజెప్పి గొడవ లేకుండా ఉండాలని సముదాయించారు. భార్య ఇద్దరు పిల్లలను పడక గదిలోంచి బయటకు పంపించి నరేశ్ తలుపు వేసుకున్నాడు. సోమ వారం ఉదయం గది నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి డోర్ కొట్టడంతో తలుపు తీయలేదు. దీంతో పక్కింటివారు తలుపు పగలగొట్టి చూడగా నరేశ్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతుంది. దీంతో భార్య ఉమా బోరున విలపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment