
చట్టాలపై అవగాహన అవసరం
అనంతగిరి: చట్టాలపై యువతీ యువకులకు అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని తక్షశిల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత సన్మార్గంలో పయనించాలన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకు నిరంతరం శ్రమించాలన్నారు. కష్టపడితే ఏదైన సాధ్యమన్నారు. ర్యాష్ డ్రైవ్ చేసి ప్రమాదాలకు గురికావొద్దని సూచించారు. సమాజ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బాల్యవివాహాలు చేయడం నేరమన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేష్, శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ భూమయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్
Comments
Please login to add a commentAdd a comment