
ఆరోగ్యమే మహాభాగ్యం
తాండూరు టౌన్: ఆరోగ్యమే మహాభాగ్యమని, వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఆర్టీ ప్రతినిధి డాక్టర్ సమీవుల్లా అన్నారు. మంగళవారం సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో తాండూరు పరిధిలోని ఐకేపీ, మెప్మా, డ్వాక్రా సహాయ సంఘాల మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 80 మందికి బీపీ, షుగర్, టీబీ వంటి వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఏడాదిలో రెండు సార్లయినా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఏదైనా వ్యాధి బారిన పడితే వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ ఆనంద్‌గోపాల్, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమీవుల్లా, మెప్మా అధికారి రాజేంద్రప్రసాద్, ఐసీఎన్ కృష్ణవేణి, కౌన్సిలర్ పర్వతాలు, ఓఆర్‌డబ్ల్యూ ప్రకాష్, అనంతప్ప, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరులు పాల్గొన్నారు.
ఏఆర్టీ ప్రతినిధి డాక్టర్ సమీవుల్లా
Comments
Please login to add a commentAdd a comment