
ఇసుక పర్మిట్లు రద్దు
తాండూరు రూరల్: తాండూరు మండలంలో ఇసుక అక్రమ రవాణాపై మంగళవారం సాక్షి దినపత్రికలో అంగట్లో పర్మిట్లు అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఖాంజాపూర్ వాగు నుంచి ఇసుక పర్మిట్లను రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. అలాగే పాత ప్రొసీడింగ్ కాపీలు చూపి ఇసుక అనుమతులు పొందిన ట్రాక్టర్ల యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇసుక అక్రమ దందాపై స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీశారు. రెవెన్యూ కార్యాలయానికి వచ్చి వివరాలు సేకరించారు. ఈ విషయమై మంగళవారం తహసీల్దార్ తారాసింగ్ మీడియాతో మాట్లాడారు. పాత ప్రొసీడింగ్ కాపీలతో ఇసుక పర్మిషన్ పొందిన ట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతామని తెలిపారు. ఇకపై అభివృద్ధి పనులకు సంబంధించి ఇసుక పర్మిషన్లు ఇచ్చే సమయంలో తమ కార్యాలయ సిబ్బందితో విచారణ చేసిన తర్వాలే అనుమతులు ఇస్తామని తెలిపారు. అక్రమంగా ఇ సుక రవాణా చేసిన ట్రాక్టర్ల (ఏపీ 07 టీహెచ్ 359 4,ఏపీ 28 డీడీ 6985,టీజీ 34 టీఆర్ 1913, టీఎస్ 15 యూఏ 8203,టీఎస్ 15 యూఏ 1435) యజమానులపై పోలీసులకు ఫి ర్యాదు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా కొందరు చేసే పనుల కారణంగా పార్టీ, ప్రభుత్వం బద్నాం అవుతోందని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ల యజమానులు వారిపై కేసులు పెట్టకుండా రాజకీయ నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

ఇసుక పర్మిట్లు రద్దు
Comments
Please login to add a commentAdd a comment