
‘యూడీఐడీ’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
అనంతగిరి: ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం)కార్డు కోసం యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సదరం క్యాంపుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు. క్యాంపుల వివరాలను మెసేజ్‌ల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి వెంకటరవణ, డీసీఎచ్‌ఎస్ ప్రదీప్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, సూపరింటెండెంట్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్
Comments
Please login to add a commentAdd a comment