
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మాడ్గుల: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాడ్గుల సీఐ వేణుగోపాల్ రావు తెలిపారు. సోమవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా అందుగుల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్లు, యాజమనులపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.
9 కిలోల గంజాయి పట్టివేత
ఇద్దరి నిందితుల అరెస్టు
చేవెళ్ల: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను చేవెళ్ల పోలీసులు చాకచక్యంగా అదుపులోని తీసుకున్నారు. చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్, డిటెక్టివ్ సీఐ సీహెచ్ ఉపేందర్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేసారం గ్రామ సమీపంలో బైపాస్ రోడ్డు పక్కన నలుగురు అనుమానిత వ్యక్తులు ఆదివారం రాత్రి ఓ వ్యాగనర్ కారు, స్కూటీపై ఆగి ఉండటం కనిపించారు. అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఎస్‌ఐ వనం శిరీష టీమ్‌తో వారి వద్దకు వెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించటంతో వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. వాహనాలను తనిఖీ చేయగా రెండు బ్యాగులలో 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమైంది. దీంతో వారికి అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు ఏపీలోని రాజమండ్రికి చెందిన గోబెరు వెంకట చైతన్య అలియాస్ షేక్ రిజ్వాన్‌గా గుర్తించారు. మరో వ్యక్తి కూరెళ్ల సాయిఅరుణ్ నగరంలోని ఉప్పల్‌లో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పారిపోయిన నిందితులు సూర్యాపేటకు చెందిన షేక్ అబ్బాస్, గణేశ్‌లుగా గుర్తించినట్లు విచారణలో చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులకు గాయాలు
కేశంపేట: బైక్ పైన వెళ్తున్న తండ్రీకొడుకులను బొలెరో వాహనం ఢీకొన్న సంఘటన మండల పరిధిలోని ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... అల్వాల గ్రామ పరిధిలోని తులవానిగడ్డకు చెందిన రంగయ్య, తన కుమారుడు ఉజ్వల్‌తో ఆదివారం ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి హెర్ కటింగ్ కోసం వెళ్లాడు. తిరిగి వస్తుండగా బీఎస్‌ఆర్ పెట్రోల్ పంపు దగ్గర బొలెరో వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం రంగయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
క్రీడల్లోనూ రాణించాలి
ఓఎన్‌జీసీ అధికారి శంకర్‌నాయక్
కొత్తూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రాణించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అంతర్జాతీయ అథ్లెట్, ఓఎన్‌జీసీ అధికారి శంకర్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం యూత్ క్లబ్ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. క్రీడలపై అభిరుచి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంగూర్‌నాయక్, ఉపాధ్యాయులు రవికుమార్, రాజు, బాలప్రసాద్, పీఈటీ నవనీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment