
ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించండి
మీర్‌పేట: తమకు ఈఎస్‌ఐ సౌకర్యంతో పాటు పీ ఎఫ్ అందేలా చొరవ తీసుకోవాలని మీర్‌పేట కార్పొరేషన్ వాటర్‌మెన్‌లు, ఎలక్ట్రీషియన్‌లు సోమ వారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లుగా పీఎఫ్ అందక ఇబ్బందులు పడుతున్నామని, ఈఎస్‌ఐ కార్డులు సైతం జారీ చేయడం లేదని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు ఐదేళ్లుగా యూనిఫారంలు, మున్సిపాలిటీ నుంచి రావాల్సిన సరుకులు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నా రని, ఎన్నోసార్లు వినతిపత్రాలు సమర్పించినా న్యాయం జరగడం లేదని మొర పెట్టుకున్నారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ పది రోజుల్లోగా సిబ్బంది సమ ్డస్యలను పరిష్కరించాలని కమిషనర్ జ్ఞానేశ్వర్‌ను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది లాగే వా టర్‌మెన్‌లు, ఎలక్ట్రీషియన్లకు అన్ని సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. సిబ్బంది సురేందర్‌యాదవ్, యాదగిరి, భిక్షపతి, జంగ య్య, దశరథ, రమేశ్‌రెడ్డి, వెంకటేశ్, మాజీ కార్పొ రేటర్ అనిల్‌యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సబితారెడ్డికి విన్నవించిన మీర్‌పేట కార్పొరేషన్ సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment