
నిర్లక్ష్యానికి ప్రాణం బలి
మంచాల: ఓ వ్యక్తి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన నాగార్జునసాగర్– హైదరాబాద్ మార్గంలో సోమవారం ఆగాపల్లి వద్ద చోటుచేసుకుంది. మంచాల ఎస్‌ఐ సతీష్‌కుమార్ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరగండ్లపల్లికి చెందిన మైలారం జంగయ్య(27) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి నగరంలో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో సోమవారం భార్య పార్వతమ్మ, కూతురు అశ్వితతో కలిసి స్వగ్రామం నుంచి బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నాడు. ఆగాపల్లి సమీపంలోని జేబీ వెంచర్ వద్దకు రాగానే నిర్లక్ష్యంగా కారు నడిపిన కోవూరి నర్సింగ్‌రావు ఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా పార్వతమ్మ, అశ్వితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన జంగయ్య ఆకస్మిక మృతితో బాధిత కుటుంబం రోడ్డున పడింది.
బైక్‌ను ఢీకొట్టిన కారు
అక్కడికక్కడే వ్యక్తి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

నిర్లక్ష్యానికి ప్రాణం బలి
Comments
Please login to add a commentAdd a comment