
యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా పెంటయ్య
దుద్యాల్: యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా దుద్యాల్ మండలం పోలేపల్లికి చెందిన పుర్ర పెంటయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు నియామక పత్రం అందజేశారు. అనంతరం పుర్ర పెంటయ్య మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్ర నాయకులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా యాదవులహక్కుల కోసం పోరాడుతానని అన్నారు. కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ మాజీ కార్పొరేటర్ జంగయ్య యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్, నాయకులు మల్లేశ్, వీరేందర్, అంజి తదితరులు పాల్గొన్నారు.
దోర్నాల్‌లో వ్యవసాయ
కళాశాల విద్యార్థుల పర్యటన
ధారూరు: మండలంలోని దోర్నాల్ గ్రామంలో సోమవారం పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్, శాస్త్రవేత్త యమున, ఏఈఓ సంజూరాథోడ్ గ్రామంలో వ్యవసాయ కళాశాల విద్యార్థుతులతో కలిసి భాగస్వామ్య విశ్లేషణాత్మక కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వనరులు, నేల రకాలు, వాటి స్వభావం, పండించాల్సిన పంటల గురించి వారు రైతులకు సలహాలు ఇచ్చారు. పంటల సాగు విధానం, పాటిస్తున్న మెళకువల గురించి వారు రైతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు గ్రామంలోని రైతు కుటుంబాలను సర్వే చేసిన అనంతరం సామాజిక చిత్రపటాన్ని వేసి రైతులకు విపులంగా వివరించారు.
‘మోడల్’లో ప్రవేశాలకు గడువు పొడిగింపు
కుల్కచర్ల: మండలంలోని ముజాహిద్‌పూర్ మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్‌లో ప్రవేశాలకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు మోడల్ స్కూల్ వెబ్ సైట్‌నుసందర్శించాలన్నారు.
గ్రంథాలయాలు
విజ్ఞాన భాండాగారాలు
జిల్లా గ్రంథాలయ శాఖ కార్యదర్శి సురేష్
కుల్కచర్ల: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ శాఖ కార్యదర్శి సురేష్ అన్నారు. సోమవారం చౌడాపూర్ మండల కేంద్రంలో గ్రంథాలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్‌కుమార్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని దుద్యాల్, చౌడాపూర్ మండలకేంద్రాల్లో నూతన గ్రంథాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు రావడం జరిగిందని.. ఇందులో భాగంగా స్థల పరిశీలన చేశామన్నారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు గ్రంథా లయాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో చౌడాపూర్ పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, నాయకులు మాసయ్య, రాము, శరత్‌కుమార్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా పెంటయ్య

యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా పెంటయ్య
Comments
Please login to add a commentAdd a comment