జర్నలిస్టుల భూమి సర్వే చేయండి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల భూమి సర్వే చేయండి

Published Wed, Mar 5 2025 9:48 AM | Last Updated on Wed, Mar 5 2025 9:48 AM

జర్నలిస్టుల భూమి సర్వే చేయండి

జర్నలిస్టుల భూమి సర్వే చేయండి

స్థానికం

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని అంతారం గుట్ట సమీపంలో జర్నలిస్టులకు సంబంధించిన భూమిలో సర్వే నిర్వహించాలని సీనియర్‌ జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ తారాసింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టులు మాట్లాడుతూ.. అంతారంగుట్ట పైన సర్వే నంబరు 116, 117లో ఉన్న తమ భూమిని సర్వే చేసి కేటాయించాలని కోరారు. తహసీల్దార్‌ స్పందిస్తూ.. సర్వేయర్‌ మహేశ్‌ సెలవుల్లో ఉన్నారని, ఆయన వచ్చిన వెంటనే సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శ్రీనివాస్‌చారి, వేణుగోపాల్‌రెడ్డి, లింగేశ్‌, వెంకట్‌రెడ్డి, శివానంద్‌, వెంకట్రాంరెడ్డి, శాంతు, సంగమేశ్వర్‌ ఉన్నారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన మీడియా బృందం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement