
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు
దుద్యాల్: మండల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణానికిగాను రూ.1.20 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి, డీఈ సుదర్శన్‌రావు, ఏఈ సురేందర్‌రెడ్డి, కొడంగల్ ఎంఏసీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలంగౌడ్, ఉపాధ్యక్షుడు కృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్‌పాషా, మాజీ సర్పంచ్ ఖాజా, గ్రామస్తులు సాయన్న, సత్యనారాయణ, అశోక్, హాజీ, శాంతు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment