
విజన్ లేని ముఖ్యమంత్రి పాలన
హుడాకాంప్లెక్స్: రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్ లేకుండా పాలిస్తున్నారని, పది రూపాయల పనికి వందసార్లు ప్రభుత్వాన్ని అడగాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. సరూర్‌నగర్ డివిజన్ హుడాకాంప్లెక్స్‌లో మంగళవారం ఆమె పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అధికారులను బాధ్యతగా పనిచేయించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలని.. తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎన్నికలప్పుడు మాట్లాడినట్లే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలపై దృష్టి పడితే బాగుంటుందని హితవు పలికారు. వేసవి సమీపిస్తున్నందున తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు లోకసాని కొండల్‌రెడ్డి, దర్పల్లి అశోక్, సుశీలరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహ్మద్ ఇస్మాయిల్, సాలమ్మ, శృతి, సునీల్‌యాదవ్, ఆకుల అరుణ్, రాజు యాదవ్, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment