ఎల్‌ఆర్‌ఎస్‌ వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ వినియోగించుకోవాలి

Published Wed, Mar 5 2025 9:49 AM | Last Updated on Wed, Mar 5 2025 9:49 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ వినియోగించుకోవాలి

ఎల్‌ఆర్‌ఎస్‌ వినియోగించుకోవాలి

అనంతగిరి: ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో రుసుము చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని సూచించారు. మార్చి 31వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే 25శాతం రాయతీ వర్తిస్తుందని చెప్పారు. అర్బన్‌, రూరల్‌, గ్రామ పంచాయతీ లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీంపై అవగాహన కల్పించాలన్నారు. 2020 ఆగస్టు 26 వరకు పదిశాతం ప్లాట్లు విక్రయించిన లేఔట్‌లకు క్రమబద్ధీకరణ వర్తిస్తుందని చెప్పారు. సబ్‌ రిజిస్టర్‌ ద్వారా నిర్ణీత నమూనాలో సేకరించిన దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం మున్సిపల్‌ శాఖకు వివరాలు పంపించి, క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. ప్రత్యేకంగా హె ల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. క్రమబద్ధీకరించని భూముల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతి ఉండదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, ట్రెయినీ కలెక్టర్‌ ఉమాహారతి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మున్సిపల్‌ కమిషరర్లు జాకీర్‌ అహ్మద్‌, బలరాంనాయక్‌, వెంకటయ్య, విక్రంసింహారెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే 25 శాతం రాయితీ

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement