
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి గిరిజన సంఘం నాయకులు బుధవారం క్షీరాభిషేకం చేశారు. కొడంగల్ పట్టణ శివారులో నిర్మిస్తున్న బంజారా భవనానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.3.65 కోట్లు మంజూరు చేయడంతో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సేవా లాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శివరామ్ చౌహాన్, సంతోష్ నాయక్, శంకర్ నాయక్, డాక్యా నాయక్, తార్యా నాయక్, పాండు నాయక్ శివ రాథోడ్, రాజు నాయక్ నరేష్ నాయక్ పాల్గొన్నారు.
భగీరథ పైపునకు లీకేజీ
మోమిన్‌పేట: మొరంగపల్లి నుంచి ఎన్కేపల్లికి వెళ్లే రహదారిలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు రెండు వేర్వేరు ప్రదేశాలలో లీకేజీలు ఏర్పడి నీరంతా వృథాగా పోతుంది. దీంతో ఎన్కేపల్లిలో వారం రోజులుగా తాగు నీరు సరిపడా అందడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని పేర్కొంటున్నారు. ఉన్నాతాధికారులు స్పందించి లీకేజీలకు మరమ్మతులు చేసి నీటి వృథాను అడ్డుకోవాలని కోరుతున్నారు.
సేవాలాల్ మహరాజ్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ
అనంతగిరి: అలిండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో బుధవారం వికారాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రికి వెళ్లే ప్రధాన చౌరస్తా వద్ద సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పరుశురాంనాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు నరేందర్‌నాయక్, పట్టణ అధ్యక్షుడు రమేష్ నాయక్, నాయకులు బాబులాల్ జాదవ్, విజయ్‌కుమార్‌నాయక్, పరుశురాంజాదవ్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
కుల్కచర్ల: ముందు వెళ్తున్న బైక్‌ను సడన్‌గా ఆపడంతో వెనుక వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. దోమ మండలం మల్లేపల్లికి చెందిన అంజిలయ్య తన సోదరి నర్సమ్మ, కుమారుడు నవీన్‌తో కలిసి కుల్కచర్ల నుంచి దాదాపూర్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బండవెల్కిచర్ల గ్రామ శివారులో ముందు వెళ్తున్న బైక్ సడెన్‌గా నిలిపివేయడంతో వెనుక వస్తున్న అంజిలయ్య బైక్ అట్టి బైక్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో అంజిలయ్య, నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సడన్‌గా బైక్ ఆపిన వ్యక్తికి కూడా గాయాలైనట్లు తెలిసింది.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment