
విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించాలి
కుల్కచర్ల: విద్యార్థులు సాంకేతిక అంశాలపై పట్టు సాధించాలని చౌడాపూర్ ఎంపీడీఓ సోమలింగం, ఎంఈఓ రాంచందర్ పేర్కొన్నారు. బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో పీఎం శ్రీ సైన్స్‌ఫేయిర్, ఫుడ్ ఫెస్టీవల్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్యంశాలను చదవడంతో పాటుగా టెక్నికల్ అంశాలపై సైతం నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా 89 రకాలైన సైన్స్ ప్రయోగాలు, 25 రకాల వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కొత్త అలివేలు, కార్యదర్శి రాజిరెడ్డి, సీఆర్పీలు రఘు, విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, గౌస్ నదీమ్, సురేష్‌కుమార్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment