
హెచ్‌ఐవీపై అప్రమత్తత ముఖ్యం
పూడూరు: ప్రతిఒక్కరూ హెచ్‌ఐవీ పరీక్షలు చేసుకోవాలని వైఆర్‌జీకే జోనల్ సూపర్‌వైజర్ రాములు తెలిపారు. బుధవారం వైఆర్‌జీ కేర్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని చన్గోముల్ హెల్త్ సబ్ సెంటర్‌లో 53 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ ఉన్న వారు ఆందోళన చెందరాదని, వారి కోసం ఉచితంగా మందులు అందిస్తున్నామన్నారు. గ్రామాల్లో అనుమానం ఉన్న వారు టీబీతో పాటు సుఖవ్యాధుల కోసం సబ్ సెంటర్‌లో పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. హెచ్‌ఐవీ వచ్చిన వ్యక్తి జీవిత కాలం బతకాలంటే సమీపంలోని ఏఆర్‌టీ కేంద్రంలో అందుబాటులో ఉన్న మందులు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం పద్మ, లింక్ వర్కర్ సుధా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment