
డీఎల్‌పీఓ సంధ్యారాణి
నీటి ఎద్దడి రానివొద్దు
కుల్కచర్ల: సమస్యల పట్ల ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని డీఎల్‌పీఓ సంధ్యారాణి, ఎంపీడీఓ రామకృష్ణ అన్నారు. బుధవారం కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌పీఓ మాట్లాడుతూ... ప్రస్తుతం వేసవికాలం వస్తున్న నేపథ్యంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నీటి సౌలభ్యాన్ని బట్టి గ్రామ పరిధిలోని నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా మార్చి చివరి వారం వరకు టాక్స్ కలెక్షన్లు వందశాతం పూర్తయ్యేలా కార్యదర్శులు పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment