సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
కుల్కచర్ల: సబ్బండ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చౌడాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్, పుర్సంపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో బీటీ రోడ్ల ప్రారంభోత్సవం, మరికల్‌లో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు భూమిపూజ, చౌడాపూర్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలితాలు చేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రతి గ్రామంలో రహదారులను ఏర్పాటు చేసి రవాణావ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకమైన నిధులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అనుసరించి ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్మోహన్‌శర్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్‌కుమార్, ఉపాధ్యక్షుడు నరసింహనాయక్, తహసీల్దార్ ప్రభులు, ఎంపీడీఓ సోమలింగం ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment