60 | - | Sakshi
Sakshi News home page

60

Published Thu, Mar 6 2025 6:47 AM | Last Updated on Thu, Mar 6 2025 6:47 AM

60

60

5
సెమీ అర్బన్‌ పరిధిలోకి..
● పూడూరు, నవాబుపేట మండలాల్లో ఎక్కువ భాగం ● ఇప్పటికే ‘వుడా’ పేరుతో 190 జీఓను విడుదల చేసిన ప్రభుత్వం ● ఊపందుకోనున్న అభివృద్ధి

మండలాలు

గ్రామాలు

వికారాబాద్‌: ెసమీ అర్బన్‌ పరిధిలోకి మన జిల్లా కూడా రావడం చర్చకు దారితీసింది. గతంలో ఏడు జిల్లాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. ప్రభు త్వం తీసుకున్న తాజా నిర్ణయంతో హెచ్‌ఎండీఏ 11 జిల్లాలకు విస్తరించింది. ఇందులో వికారాబాద్‌ జిల్లా పరిధిలోని ఐదు మండలాలు ఉండనున్నాయి. ట్రిపుల్‌ ఆర్‌కు ఐదు కిలోమీటర్ల అవతలి వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పరిధిలోకి మన జిల్లా కూడా వచ్చేసింది. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్‌ జిల్లా అభివృద్ధిలో మాత్రం అట్టడుగున నిలిచిపోయింది. హైదరాబాద్‌కు రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలతో కూడా మన జిల్లా పోటీ పడలేని స్థితిలో ఉండిపోయింది. నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతూ వస్తున్న జిల్లా నుంచి ఒకే సారి సీఎం, స్పీకర్‌ రూపంలో ప్రభుత్వంలో ఇద్దరు నేతలు కీలకంగా ఉండటం కూడా జిల్లాకు కలిసొచ్చింది. జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి ముందుగా కడా (కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు చేశారు. ఇటీవల జిల్లా సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక జీఓను విడుదల చేసింది. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల 190 జీఓను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో అభివృద్ధి మరింత ఊపందుకోనుంది. వుడా పరిధిలోకి నాలుగు మున్సిపాలిటీలు (వికారాబాద్‌,తాండూ రు, పరిగి, కొడంగల్‌) తోపాటు 493 రెవెన్యూ గ్రామాలు రానున్నాయి.

హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే గ్రామాలివే..!

హెచ్‌ఎండీఏ పరిధిలోకి జిల్లాలోని ఐదు మండలాలు 50నుంచి 60 గ్రామాలు వచ్చే అవకాశం ఉంది. ఏఏ మండలాలు, ఏయే గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయనే దానిపై చర్చ మొదలైంది. రీజనల్‌ రింగ్‌రోడ్డు మొదటి అలైన్‌మెంటే ఖరారైతే 10 నుంచి 20 గ్రామాలు మాత్రమే హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రతిపాదించిన రెండో అలైన్‌మెంట్‌ ఖరారైతే 50నుంచి 55 గ్రామాల వరకు ఈ పరిధిలోకి రానున్నాయి. జిల్లా పరిధిలోని నాలుగు మండలాలను కలుపుతూ ట్రిపుల్‌ ఆర్‌ వెళ్తుంది. ఐదు కిలోమీటర్లు వెలుపలి వరకు హెచ్‌ఎండీఏ విస్తరించాలనే ప్రతిపాదన నేపథ్యంలో మరో మండలం పరిగికి చెందిన కొన్ని గ్రామాలు కూడా దీని పరిధిలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. మన జిల్లాకు చెందిన పూడూరు, నవాబుపేట మండలాల పరిధిలోని పది గ్రామాలపైగా ఈ పరిధిలోకి వస్తుండగా వికారాబాద్‌, మోమిన్‌పేట మండలాల పరిధిలోని నాలుగు నుంచి ఐదు గ్రామాలు రానున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం పూడూరు మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్‌, కంకల్‌, ఖుద్భుల్లాపూర్‌, మన్నెగూడ, చింతల్‌పల్లి, పుడుగుర్తి, తుర్క యెన్కెపల్లి, రేగడిమామిడిపల్లి, అంగడిచిట్టెంపల్లి, కండ్లపల్లి, చన్గొముల్‌, నిజాంపేట్‌మేడిపల్లి, పోతిరెడ్డిగూడ, మరియాపూర్‌, చీలాపూర్‌, కొత్తపల్లి, తిమ్మాపూర్‌, మిట్టకంకల్‌, మేడికొండ, మేడిపల్లి, మిర్జాపూర్‌, పూడూరు, గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. నవాబుపేట మండల పరిధిలోని అక్నాపూర్‌, పులిమామిడి , నారెగూడ, గంగ్యాడ, గుబ్బడిఫత్తేపూర్‌, ముబారక్‌పూర్‌, పూలపల్లి, గొల్లగూడ, లింగంపల్లి, ఎల్లకొండ, మైతాప్‌ఖాన్‌గూడ, మాదిరెడ్డిపల్లి, సాయన్నగూడ, వట్టిమీనెపల్లి, రామన్నగూడ, చించల్‌పేట్‌, అత్తాపూర్‌, చిట్టిగిద్ద, నవాబుపేట గ్రామాలు ఈ పరిధిలోకి రానున్నాయి. ఇక వికారాబాద్‌ మండల పరిధిలోని సిద్దులూర్‌, కొటాలగూడ, లాల్‌సింగ్‌తండ, పులుసుమామిడి, పీరంపల్లి, మోమిన్‌పేట మండల పరిధిలోని చీమల్‌ధరి, బాల్‌రెడ్డిగూడ, చక్రంపల్లి గ్రామాలు ఈ పరిధిలోకి రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement