
తాగునీటి సమస్య రావొద్దు
డీపీఓ జయసుధ
నవాబుపేట: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీపీఓ జయసుధ ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే ఎండల తీవ్రత పెరిగినందున గ్రామాల్లో నీటి సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు ముందుస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇలాగే ఇంటి, ఇతర పన్నులు వంద శాతం వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపయోగించుకొని ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విధులకు డుమ్మా కొడితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమలో ఎంపీడీఓ అనురాధ, ఎంపీఓ విజయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నీటి సంరక్షణ పనులు భేష్
ప్రొఫెసర్ లతీఫ్ పాషా
మోమిన్‌పేట: మండలంలో నీటి సంరక్షణ పనులు బాగున్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే అవగాహన కలుగుతుందని ప్రొఫెసర్ లతీఫ్ పాషా అన్నారు. బుధవారం మోమిన్‌పేట మండలం గోవిందాపూర్, వెల్‌చాల్ గ్రామాల్లో చేపట్టిన నీటి సంరక్షణ పనులను రాజేంద్రనగర్ తెలంగాణ జయశంకర్ విశ్వ విద్యాలయం అగ్రోనమి విభాగ విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వాటర్ షెడ్ పనుల్లో భాగంగా నీటి కుంటలు, చెక్ డ్యాంలు నిర్మించారని తెలిపారు. వర్షం కురిసినప్పుడు వరద నీరు వృథాగా దిగువకు వెళ్లకుండా వాలుకు అడ్డంగా చెక్ డ్యాంలు, నీటి కుంటలు నిర్మించినట్లు తెలిపారు. తద్వార నీరు ఇంకి భూగర్భ జలాలు పైకి వస్తాయన్నారు. వ్యవసాయానికి, పశువులకు నీరు పుష్కలంగా దొరుకుతుందని చెప్పారు. అంతేకాకుండా వాలుకు అడ్డంగా రాతి కట్టలు కట్టడం ద్వారా భూమి కోతకు గురికాదన్నారు. కార్యక్రమంలో ఏఈఓ పెంటయ్య, వాటర్ షెడ్ అధికారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పోచయ్య రైతులు పాల్గొన్నారు.
హాల్ టికెట్
అందజేతలో ఆలస్యం
పరీక్ష మిస్సయిన ఇంటర్ విద్యార్థి
పరిగి: కళాశాల ఫీజు కట్టకట్టలేదనే కారణంతో సకాలంలో తనకు హాల్ టికెట్ ఇవ్వలేదని, దీంతో పరీక్ష రాయలేకపోయానని ఇంటర్ ఓ విద్యార్థి వాపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీసాయి ఒకేషనల్ జూనియర్ కాలేజీలో నాగేశ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్ బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు రాసేందుకు మంగళవారం హాల్ టికెట్ కోసం కళాశాలకు వెళ్లాడు. ఫీజు చెల్లించని వారు తర్వాత రావాలని సిబ్బంది సూచించడంతో సాయంత్రం వేళ ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తీసుకుని, సెంటర్‌కు చేరుకునే సరికి సమయం 9:20 కావచ్చింది. దీంతో నిర్వాహకులు అతన్ని పరీక్షకు అనుమతించలేదు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తాను పరీక్ష మిస్సయ్యానని బాధితుడు ఆరోపించాడు. ఆ విషయంపై ప్రిన్సిపల్ శ్రీశైలంను వివరణ కోరగా.. విద్యార్థి ఉదయం 8:55 నిమిషాలకు హాల్‌టికెట్ కోసం వచ్చాడని, దీంతోనే ఆలస్యం జరిగిందని తెలిపారు.

తాగునీటి సమస్య రావొద్దు

తాగునీటి సమస్య రావొద్దు
Comments
Please login to add a commentAdd a comment