
కృత్రిమ మేధపై అవగాహన పెంచాలి
● బెంగళూరు ఏక్ స్టెప్ ఫౌండేషన్ టీం సభ్యురాలు ఆనంది
పరిగి: ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ(ఏఐ) తరగతలు నిర్వహించడం మంచి నిర్ణయమని బెంగళూరుకు చెంది ఏక్ స్టెప్ ఫౌండేషన్ ప్రతినిధులు అన్నారు. బుధవారం మండలంలోని గడిసింగాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న ఏఐ పాఠ్యాంశాలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే ఏఐ విద్యను అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, మండల విద్యాధికారి గోపాల్, ఏఎంఓ రామ్ మస్తాన్, ప్రధానోపాధ్యాయుడు వెంకట్, అనంతరావు పాల్గొన్నారు.
బొంపల్లి ప్రాథమిక పాఠశాలలో..
దోమ: విద్యార్థులకు కృత్రిమ మేధ(ఏఐ)పై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంగళూరుకు చెందిన ఏక్ స్టెప్ ఫౌండేషన్ సభ్యురాలు ఆనంది అన్నారు. బుధవారం దోమ మండలం బొంపల్లి ప్రాథమిక పాఠశాలను డీఈఓ రేణుకాదేవితో కలిసి బృందం సభ్యులు సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న కంప్యూటర్ విద్యను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచే కృత్రిమ మేధపై అవగాహన కల్పించాలనే ప్రభుత్వం నిర్ణయం ఎంతో మంచిదన్నారు. ప్రతి విద్యార్థికీ చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలన్నారు. ఏఐపై అవగాహన పెంచాలంటే ప్రత్యేక సిబ్బంది ఉండాలని పాఠశాల ఉపాధ్యాయురాలు స్వప్న బెంగళూరు టీం సభ్యుల దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు వివరించి సిబ్బందిని నియమించేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎంఓ రామ్‌మస్త, టెక్నికల్ పర్సన్ శేఖర్, ఎంఈఓ వెంకట్, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం షఫీ, ఉపాధ్యాయులు సావిత్రి, స్వప్న, జరీనాబేగం, వెంకటయ్య, ముత్యప్ప, అనంతయ్య, సీఆర్‌పీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment